చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఆయనే చెప్పుకుంటున్నారు : మంత్రి అంబటి

-

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే.. తాజాగా చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చారు.. అవంటే ఎందుకు అంత భయమని మంత్రి అంబటి ప్రశ్నించారు. దొంగ తనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడని మంత్రి ఆరోపించారు. నోటీసులు ఇచ్చిన అధికారులను చంద్రబాబు ఎదురు ప్రశ్నిస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ముడుపులు తీసుకున్న మాట నిజం అని అధికారులు నిర్ధారించుకున్న తర్వాత అధికారులు నోటీసులు ఇచ్చి ఉంటారని మంత్రి అంబటి పేర్కొన్నారు.

మరోవైపు చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఆయనే చెప్పుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు.. చంద్రబాబు ఏమన్నా పెద్ద మగాడా అరెస్ట్ చేయకుండా ఉండడానికి అని విమర్శలు గుప్పించారు మంత్రి అంబటి. తప్పు చేసిన వారు దుబాయ్ వెళ్లినా, అమెరికా వెళ్లినా అరెస్ట్ తప్పదన్నారు. పోలీసుల మీద రాళ్లు వేసి దాడులు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి తెలిపారు.

ఆంధ్ర రైతులు నీటి ఎద్దడి పరిస్థితిలో ఉన్నారని అంబటి అన్నారు. 122 ఏళ్లలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదని.. దీనికి కారణం చంద్రబాబు అని ప్రజలు అనుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టుల వద్ద చంద్రబాబు ముదనష్టపు కాలు పెట్టడం వల్లే నీటి ప్రాజెక్ట్ లు ఎండి పోతున్నాయని అనుకుంటున్నారని విమర్శించారు. నిజం ఏంటో ప్రజలే నిర్ణయిస్తారని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరు తడి పంటల పై రైతులు దృష్టి పెట్టాలని కోరారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వర్షాలు లేవన్నారు. సాగర్ పరిధిలో పరిస్థితిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని అంబటి రాంబాబు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version