ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన చంద్రబాబుకు ఐటి నోటీసులు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో నిందితులుగా పేర్కొంటున్న ఇద్దరు వ్యక్తులు విదేశాలకు పరారయ్యారు. యోగేష్ గుప్తాకు ఐటి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లిన ఇద్దరి వ్యవహారంలో ఐటి ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. తాజాగా.. తాజాగా ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందిస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో ఆయన మాట్లాడుతూ.. దొంగ పనులు చేసిన చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదని ప్రశ్నించారు. చంద్రబాబు చంద్ర మండలం మీదకు వెళ్లిన అరెస్ట్ చేసి తీరుతామని గుడివాడ అమర్నాథ్ విమర్శలు చేశారు. రూ. 118 కోట్ల లంచాల కేసులో తన పీఏ శ్రీనివాస్ ను, బ్రోకర్ మనోజ్, వాస్ దేవ్, పార్థసారథిలను చంద్రబాబు దేశం దాటించి, పారి పోయేలా చేశాడన్నారు. తప్పు చేయనప్పుడు వారిని ఎందుకు దేశం దాటించారని అన్నారు గుడివాడ అమర్నాథ్. ఒకరు అమెరికా, మరొకరు దుబాయ్ పారిపోవడానికి కారణం ఏంటని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. లంచాలు తీసుకున్న చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయకూడదని మంత్రి అమర్నాథ్ అన్నారు. అది తెలిసే తనను అరెస్ట్ చేయొచ్చంటూ.. సింపతీ పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, సీపీఐ నారాయణ ఎందుకు స్పందించడం లేదని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. అవినీతిలో చంద్రబాబుకు సహకరించిన దొంగలు ఎక్కడ దాక్కున్నా లాక్కుని వస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబుపై బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు గుడివాడ అమర్నాథ్.