గ్రామాల్లో ఉన్న రోడ్డులపై కూడా టోల్ వసూల్ : అంబటి

-

కూటమి పార్టీలు ఎన్నికల కు ముందు అనేక హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాం అన్నారు. ఓటేయండి తమ్ముళ్లు విద్యుత్ చార్జీలు తగ్గిస్తామ్ అని హామీలు ఇచ్చారు. ఓడ మల్లయ్య బోడి మల్లయ్య సామెత తో ఓట్లు దండుకున్నారు. బాదుడే బాదుడు అని చెప్పి అధికారం లోకి వచ్చి 15,485 కోట్ల విద్యుత్ చార్జీలు బాదారు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆ రోజు స్మార్ట్ మీటర్ లు పగల కొట్టమని చెప్పిన టిడిపి నాయకులు ఇప్పుడు ఎందుకు స్మార్ట్ మీటర్ లు బిగిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది.

గ్రామాల్లో ఉన్న రోడ్డు ల పై కూడా టోల్ వసూలు చేస్తారంట.. ఇదేనా సంపద సృష్టించడం అంటే. అప్పులు కోసం చిప్ప పట్టుకుని తిరుగుతున్నారు. అప్పుల తోనే ప్రభుత్వాన్ని నడిపే స్థితికి వచ్చారు. కూటమి ప్రభుత్వం లో ఆదాయం పడిపోయింది. చంద్రబాబు చెప్పేవన్నీ గొప్పలు, చేసేవి అభూత కల్పనలు. ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పిన కూటమి ప్రభుత్వం.. 410 మంది ఉద్యోగుల ను ఫైబర్ నెట్ నుంచి తొలగిస్తున్నారు.. నిరుద్యోగులకు ఇస్తాం అని చెప్పిన భృతి ఇవ్వడం లేదు. వైసీపీ మీద కోపం ఉంటే మాతో పోరాడండి. అంతే కాని మా ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు పీకేయకండి అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news