ఐపీఎల్ 2022 లో అంబ‌టి రాయుడు కొత్త అవ‌తారం

-

తెలుగు క్రికెట‌ర్ అంబటి రాయుడు కీలక నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈ నిర్ణ‌యంతో వ‌చ్చే ఐపీఎల్ లో అంబ‌టి రాయుడు కొత్త‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ నెల 12, 13 తేదీల‌లో ఐపీఎల్ 2022 కోసం మెగా వేలం జ‌ర‌గ‌నుంది. అయితే ఈ వేలం ముందు అంబ‌టి రాయుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈ సారి వేలం ముందు రిజిస్ట్రార్ లో బ్యాట్స్ మెన్ గానే కాకుండా వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ కోటాలో త‌న పేరును న‌మోదు చేసుకున్నాడు. కాగ ఈ మెగా వేలంలో అబంటి రాయుడు బేస్ ప్రైజ్ రూ. 2 కోట్లు ఉండ‌నుంది.

అయితే అంబ‌టి రాయుడు మొద‌టి క్రికెట్ లో అడుగు పెట్టిన స‌మ‌యంలో మంచి కీప‌ర్ గానే పేరు తెచ్చుకున్నాడు. అయితే త‌ర్వాత కాలంలో టీమిండియా లో అంబ‌టి రాయుడు ఆడినా.. ధోని ఉండ‌టంతో కీప‌ర్ అవ‌కాశాలు ద‌క్క‌లేదు. కానీ బ్యాట‌ర్ గా నిరూపించుకున్నాడు. అలాగే దేశ‌వాళీ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ అంబ‌టి రాయుడు ప‌లు మ్యాచ్ ల‌లో వికెట్ కీప‌ర్ గా క‌నిపించాడు. కాగ అంబ‌టి రాయుడు ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ర‌పున ఆడాడు. కానీ ఈ సారి చెన్నై అంబ‌టి రాయుడుని రిటెన్షన్ ప్ర‌క్రియాలో దూరం పెట్టింది. దీంతో అంబ‌టి రాయుడు మెగా వేలంలో అందుబాటులో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version