భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆయన విగ్రహానికి పార్టీ శ్రేణులు పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు.హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు జరిగాయి.
ఇక సిద్ధిపేటలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడుతూ.. ‘అంబేద్కర్ అందరివాడు కానీ తెలంగాణకు మరింత దగ్గరి వాడు. అంబేద్కర్ జయంతి అంటే పూలమాలలు వేయడం కాదు, వారి ఆశయాలను, అంబేద్కర్ గారి సిద్ధాంతాలు పాటించడమే నిజమైన నివాళి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంబేద్కర్ గారి రాజ్యాంగమే దారి చూపింది’ అని కొనియాడారు.