ప్రపంచ దేశాలలో సాఫ్ట్ వేర్ రంగంలో విద్యను అభ్యసించిన వారు అమెరికాకు వెళ్లి ఒక మంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడాలని అనుకుంటారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం అమెరికా ఐటీ కంపెనీలు వేల మందిని విదేశాల నుండి రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. కానీ తాజాగా తెలుస్తున్న ఒక నివేదిక ప్రకారం అమెరికాలో ఐటీ నిపుణుల సంఖ్య తక్కువగా ఉందట. పైగా ఇప్పుడు ఐటీ నిపుణులు కావాలని కంపెనీలు గోల పెడుతున్నాయట. ప్రస్తుతం అమెరికాలోని ఐటీ కంపెనీలు అన్నీ కూడా సాఫ్ట్ వేర్ టెకీలను చేర్చుకునే పనిలో నిమగ్నం అయి ఉన్నారు. అందుకోసం అమెరికా ప్రభుత్వం ముందుకు ఈ విషయాన్ని తీసుకువెళ్లిందని తెలుస్తోంది. వీరు ప్రతి ఏడాది అందుబాటులోకి తెచ్చే వీసాల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారట మరియు వీసాల కోటాను కూడా ఒక్కసారిగా 65 వేల నుండి రెట్టింపు చేయాలనీ కూడా ప్రతిపాదన పెట్టారట.
అమెరికాలో IT నిపుణుల కొరత … H1B వీసాలు పెంపుపై ఐటీ కంపెనీల డిమాండ్ !
-