కరోనాపై భారతీయులకు శుభవార్త..

-

రోజురోజుకీ కరోనా వైరస్ వ్యాప్తి క్రమక్రమంగా పెరిగిపోతోంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. ప్రజలంతో ఇంట్లోనే కూర్చుంటున్నారు. దేశంలో ఇప్పటే 12 మంది మృతి చెందగా 664 మంది కరోనా వ్యాధితో భాదపడుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ వ్యాధి మరింత ఎక్కువగా సోకే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 5 లక్షల మంది ఈ వైరస్ బారిన పడతారని అంటున్నారు. అయితే తాజా అధ్యయనాలు మాత్రం భారతీయులకు గుడ్ న్యూస్ చెబుతున్నాయి. వేడి, తేమ తక్కువగా ఉన్న వాతావరణమే కరోనా వ్యాప్తిని అడ్డుకుంటుందని    పేర్కొంటున్నాయి..

కరోనాపై అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు పలు అధ్యయనాలు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఉష్ణోగ్రత, గాలిలోని తేమను పరిశీలించిన వైరస్ తీరుని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అందులో కరోనా వేగంగా వ్యాప్తి చెందిన దేశాల్లో ఉష్ణోగ్రత 3 డిగ్రీల నుంచి 17 డిగ్రీల మధ్యే ఉంటోందట. 90 శాతం కేసుల్లో ఉష్ణోగ్రత, తేమ ప్రభావం చూపాయట.

ఇండియా, బ్రెజిల్, మలేసియా, అమెరికాలోని ఫ్లోరిడా, లూసియానా రాష్ట్రాల్లో కొత్త కేసులు తక్కువగా ఉండటానికి కారణం అదేనని తెలిపారు. గాలిలో తేమ ఎక్కువగా ఉండి, చల్లని వాతావరణాన్ని కలిగిన వుహాన్, స్పెన్, పోర్చుగల్ దేశాల్లో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉందని స్పష్టం చేశారు. ఉష్ణోగ్రత ఒక్కటే కరోనా వ్యాప్తిని అడ్డుకోలేదని.. తేమ కూడా ప్రధాన పాత్ర వహిస్తుందని కూడా వివరించారు.

అయితే భారత్ లో ఉన్న కేసుల సంఖ్య తక్కువేనని, దీనికి ప్రధాన కారణం దేశంలో 18 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉండటమేనని వెల్లడించారు. దీన్ని బట్టి రాబోయేది వేసవి కాలం కాబట్టి..కరోనా వైరస్ వ్యాప్తి ఇండియాలో తక్కువగా ఉంటుందనే అంచనాకు రావొచ్చని తేల్చి చెప్పారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version