ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు. అంతేకాకుండా మనము ఏది ఇతరులకు ఇవ్వాలి అనుకుంటామో అదే తిరిగి పొందుతాము. ఇలాంటివి చాలా మంది పెద్దలు రకరకాలుగా చెబుతారు. ముఖ్యంగా మనిషి టెక్నాలజీ పెరిగాక…ప్రకృతిని అనేక రీతులుగా నాశనం చేశాడు. ఫలితం ఈరోజు ప్రకృతి ముందు మనిషి మేధస్సు నిలవలేక పోతుంది. ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాల ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. ఇష్టానుసారంగా బతకటం టెక్నాలజీతో అదేవిధంగా పొల్యూషన్ తో ప్రకృతిని నాశనం చేయడం వల్ల ప్రస్తుతం మనిషిపై ప్రకృతి కన్నెర్ర చేసింది అని చెప్పవచ్చు.
ఇటువంటి డేంజర్ మనస్తత్వం కలిగిన మనుషుల పల్లె లోకం ఈ విధం గా మారిందని విమర్శలు చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఇంటిలో ఉన్న మనిషి ఈ టైంలో ప్రకృతి గురించి ఆలోచించాలని…ప్రకృతిని కాపాడాలని మరమనిషి స్వభావాన్ని విడిచి, ప్రకృతిని గౌరవించే పూర్వీకుల స్వభావాన్ని ధరించాలని మనిషి ఇప్పుడైన మారాలని కోరుతున్నారు.