నేడు ఏపీలో ఎన్నికల ప్రచారానికి అమిత్ షా

-

ఏపీ ఎన్నికల ప్రచారం రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఏపీకి బీజేపీ అగ్రనేతలు వస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేడు ఏపీలో పర్యటించనున్నారు. షా బెంగళూరు నుంచి హెలీకాప్టర్‌లో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం చేరుకుని.. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు.
మరోవైపు కడప జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచా­ర సభల్లో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొంటారు. ప్రధాని మోదీ 6న రాజమహేంద్రవరం వస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా అమిత్ షాతో కలిసి ఎన్నికల ప్రచారం పాల్గొంటారు. ధర్మవరంలో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు పాల్గొని..  మధ్యాహ్నం మూడు గంటల నుంచి అన్నమయ్య జిల్లా అంగళ్లులో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతారు. ఆ తర్వాత సాయంత్రం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని.. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version