మార్చి 12న హైదరాబాద్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

-

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి హైదరాబాద్​కు రానున్నారు. వచ్చే నెల 12న హైదరాబాద్​కు అమిత్ షా రానున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా హైదరాబాద్‌కు అమిత్ షా వస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే అమిత్ షా ఏ నియోజకవర్గంలో పర్యటిస్తారో ఇంకా ప్రకటించలేదు.

గతంలో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించేందుకు అమిత్ షా రాష్ట్రానికి వస్తారని బీజేపీ నేతలు చెప్పారు. దాదాపు పర్యటన కూడా ఖరారైంది. కానీ చివరి నిమిషంలో ఇతర ముఖ్య కార్యక్రమాలు ఉండటం వల్ల ఆ పర్యటన వాయిదా పడింది. ఈసారి అదే నిజయోకవర్గంలో పర్యటిస్తా లేదా మహబూబ్​నగర్ పార్లమెంట్​ నియోజవర్గంలో పర్యటిస్తారో తెలియాల్సి ఉంది.

అయితే ఈ రెండింట్లో ఏదో ఒక నియోజకవర్గ పర్యటనలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెనెక్కించాలని ఇటు రాష్ట్ర నాయకత్వంతో పాటు అటు జాతీయ నాయకత్వం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version