వ్యవ‘సాయం’పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

-

అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్స్ (ఏఆర్‌డీబీఎస్)కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక నిర్ణయం తీసుకున్నారు. అగ్రికల్చర్ సెక్టార్, ఇరిగేషన్ ప్రాజెక్ట్, తదితర మౌలిక సదుపాయాల కోసం దీర్ఘ కాలిక రుణాన్ని అందించాలని సూచించారు. ఏఆర్‌డీబీఎస్-2022 నేషనల్ కాన్ఫరెన్స్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. చిన్న చిన్న వ్యవసాయ క్షేత్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేలా సహకార బ్యాంకులు కృషి చేయాలన్నారు.

Amit Shah

దేశంలో సాగునీటిని పెంచేందుకు సహకార బ్యాంకులు రుణాలు అందించడంపై దృష్టి సారించాలన్నారు. అమెరికా తర్వాత అత్యధికంగా మన దేశంలోనే 49.4 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి సాగు చేస్తోందన్నారు. భారత్‌లో ఉన్న మొత్తం వ్యవసాయ భూమికి నీటిపారుదల సౌకర్యం కల్పిస్తే మిగిలిన ప్రపంచ దేశాల్ని పోషించగలిగే సత్తా మనకు ఉంటుందని అమిత్ షా అన్నారు. 90 ఏళ్లుగా సహకార సంఘాల నుంచి దీర్ఘకాలిక ఫైనాన్స్ అందిస్తున్నామని అమిత్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం ఫైనాన్సింగ్‌లో అనేక అడ్డంకులు ఏర్పడ్డాయని, వాటిని అధిగమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version