ఈనెల 21న అమిత్ షా భారీ బహిరంగ సభ

-

ఈనెల 21న అమిత్ షా భారీ బహిరంగ సభ ఉంటుందని బండి సంజయ్ పేర్కొన్నారు. గిట్టని కొంతమంది అమిత్ షా సభ వాయిదా అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు బండి సంజయ్ కుమార్. పాదయాత్రను చూసి భయపడి రాష్ట్రంలో కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాలని నిర్ణయించిందన్నారు.

రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసిన విషయంపై స్పందించిన బండి సంజయ్ కుమార్…కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఎంతకు అమ్ముడుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్లిన నేతలు ఎంత తీసుకున్నారు….రాజగోపాల్ రెడ్డి స్వయంగా కాంట్రాక్టర్. ఆయన డబ్బులకు అమ్ముడు పోవాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.

పోస్టర్లు వేయడం మేము మొదలుపెడితే టిఆర్ఎస్, కాంగ్రెస్ లు తట్టుకోలేవని వార్నింగ్ ఇచ్చాడు బండి సంజయ్. మునుగోడు ఉప్పే ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇవి సెమీఫైనల్స్ అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version