Hero Nithin : నితిన్ నువ్వు బాగుపడవు.. గురువును మర్చిపోవద్దు.. అమ్మ రాజశేఖర్ ఫైర్..

-

డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ తన సినిమా ‘హై-ఫై’ ఈవెంట్ లో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పై ఫైర్ అయ్యారు. ‘హై-ఫై’ ఫిల్మ్ ఈవెంట్ కోసం తాను హీరో నితిన్ ను పిలిచానని, వస్తానని చెప్పి నితిన్ రాలేదని చెప్తూ అమ్మ రాజశేఖర్ బాధపడ్డారు. ఈ సందర్భంగా అమ్మ రాజశేఖర్ హీరో నితిన్ పై ఫైర్ అయ్యారు.

 

ఈ మూవీ ఈవెంట్ కోసం తాను పది రోజుల ముందే హీరో నితిన్ కు చెప్పానని, వస్తానని హామీ ఇచ్చాడని, కానీ రాకుండా తనను అవమానించాడని బాధపడ్డారు అమ్మ రాజశేఖర్. అసలు డ్యాన్స్ రాని నితిన్ కు తాను గురువు మాదిరిగా డ్యాన్స్ నేర్పించానని గుర్తు చేసుకున్నాడు. తనను గౌరవించి హీరో నితిన్ వస్తాడని భావించానని కానీ రాలేదని అమ్మ రాజశేఖర్ వాపోయాడు.

నితిన్ వస్తాడని తాను ఏవీ కూడా రెడీ చేశానని, కానీ రాకుండా అవమానించాడని చెప్పాడు. కనీసంగా బైట్ కూడా ఇవ్వలేదని, ఇప్పుడు షూటింగ్స్ ఏం లేవని, ఇంట్లోనే ఉండి రాకుండా తనను నితిన్ అవమానించారని డ్యాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ తెలిపాడు. ఈ సందర్భంగా హీరో నితిన్ బాగుపడడని హెచ్చరించాడు రాజశేఖర్. జీవితంలో ఎదుగుదలకు తోడ్పడిన వ్యక్తులను, గురువును మరిచిపోవద్దని హీరోలందరికీ అమ్మ రాజశేఖర్ సూచించాడు. ‘హై-ఫై’ సినిమాకు అమ్మ రాజశేఖర్ దర్శకత్వం వహించాడు.

YouTube video player

Read more RELATED
Recommended to you

Exit mobile version