అమరావతి నగరానికి అవార్డు.. ఎందుకో తెలుసా..?

-

ఓవైపు అమ‌రావ‌తి ర‌గ‌డ కొన‌సాగుతుంటూ.. మ‌రోవైపు ఈ న‌గ‌రానికి ఓ అవార్డు లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అస‌లు ఏంటా అవార్డు..? దీనికి అవార్డు వ‌చ్చింది..? అన్న ప్ర‌శ్న‌లు చాలా మందిలో మొద‌లై ఉంటాయి. మ‌రి లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్తే.. స్మార్ట్ సిటీ మిషన్ లక్ష్యాలను చేరుకోవడంలో కనబర్చిన పురోగతి ఆధారంగా అమరావతిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. స్మార్ట్ నగరాల అంశంలో రికగ్నేషన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ కేటగిరీలో అమరావతికి ఈ పురస్కారం లభించింది.

విశాఖలో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఆకర్షణీయ నగరాల మూడో శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో భాగంగా పలు అంశాల్లో ఆదర్శంగా నిలిచిన నగరాలకు అవార్డులు అందిస్తున్నారు. కాగా, విశాఖపట్నం నగరానికి వినూత్న ఆవిష్కరణల అంశంలో ఫ్లోటింగ్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుపై అవార్డు అభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version