జాక్వెలిన్ కు గిప్ట్ గా ఖరీదైన నౌక.. జైలు నుంచే సుంకేష్ సంచలన లేఖ

-

ఢిల్లీలో జైలు గోడల మధ్యే ఉన్నా ఆర్థిక మోసాల కేసు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ తన లేఖలతో నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఆదివారం ఆగస్టు 11న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు తాను లేఖ రాశానని సుకేశ్ చంద్రశేఖర్ వెల్లడించాడు. 2021లో నేను జాక్వెలిన్ కి గిఫ్ట్ ఇచ్చేందుకు ఒక పడవను సెలెక్ట్ చేశాను. దానికి ‘లేడీ జాక్వెలిన్’ అని పేరు పెట్టాలని అప్పుడే నిర్ణయించాను.

జాక్వెలిన్ బర్త్ డే సందర్భంగా ఈనెలలోనే ఆ పడవను ఆమెకు అందేలా చూస్తాను. అన్ని రకాల పన్నులను చెల్లించి, సక్రమమైన గిఫ్టుగా దాన్ని జాక్వెలిన్ కు అప్పగిస్తాను” అని లేఖలో సుకేశ్ చెప్పుకొచ్చాడు. మేమిద్దరం కలిసి సముద్రంలో పడవలో జలయాత్ర చేయాలని కలలు కనే వాళ్లం. అందుకే ఆ పడవను బహుమతిగా ఇస్తున్నానని తెలిపాడు. జాక్వెలిన్ ని ఎంతో ఆదరిస్తున్న ఆమె అభిమానులకు 100 ఐఫోన్ 15 ప్రో ఫోన్లను గిఫ్టుగా అందిస్తానని సుకేశ్ చెప్పాడు. తన టీమ్ వారిని ఎంపిక చేస్తుందన్నాడు. రోమియో జూలియెట్ స్టైల్లో 2025 ఆగస్టు 11న జాక్వెలిన్ తో కలిసి బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంటానని అతడు ఆశాభావం వ్యక్తం చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version