రేపు శేఖ‌ర్ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్

-

హీరో రాజ‌శేఖ‌ర్ ప్రధాన పాత్ర‌లో వ‌స్తున్న సినిమా శేఖ‌ర్. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుపుకుంటుంది. కాగ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం జీవిత వ‌హిస్తున్నారు. ఇప్ప‌టి కే ఈ సినిమా నుంచి హీరో రాజ‌శేఖ‌ర్ ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్ కు తెలుగు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగ రేపు సాయంత్రం 4 గంట‌ల‌కు మ‌రోక అప్ డేట్ చిత్ర బృందం విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తుంది. రేపు సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ లవ్ గంటే అనే పాట ను విడుదల చేయ‌నున్న‌ట్టు చిత్ర బృందం ప్ర‌క‌టించారు.

అయితే ఈ సినిమాకు ప్ర‌ముఖ సింగీత ద‌ర్శ‌కుడు అనుప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే ఈ శేఖ‌ర్ సినిమా క్రైం థ్రిల్ల‌ర్, ఇన్వెస్టిగేటివ్ గా తెర‌కెక్కుతుంది. అయితే ఈ సినిమా మ‌ల‌యాళంలో హిట్ అయిన జోసెఫ్ అనే సినిమా రీమేక్ గా తెర‌కెక్కుతుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్లుగా ఆత్మీయ ర‌జ‌న్, ముస్కాన్ న‌టిస్తున్నారు. అలాగే రాజ‌శేక‌ర్ కుతూర్లు శివాని, శివాత్మ‌క లు కూడా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version