జైలులో బండి సంజయ్ ను పరామర్శించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని జైలులో పరామర్శించనున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నేడు కరీంనగర్ జైలుకు వెళ్లి బండి సంజయ్ క్షేమం గురించి అడిగి తెలుసుకోన్నారు. ఆ తరువాత కరీంనగర్లోని బండి సంజయ్ కార్యాలయాన్ని కూడా సందర్శించనున్నారు. సంజయ్ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్నారు కిషన్ రెడ్డి.

తెలంగాణలో ఉద్యోగులు బదిలీలు, 317 జీవో లో అంశాలను మార్చాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల క్రితం బండి సంజయ్ ’జాగరన‘ దీక్షకు పిలుపునిచ్చాడు. అయితే కోవిడ్ వేళ నిబంధనలు పాటించలేదని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తో పాటు పోలీసులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కరీంనగర్ కోర్ట్ బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ పిటీషన్ కూడా రద్దు చేసింది. అయితే మళ్లీ ఈరోజు బండి సంజయ్ తరుపున హైకోర్ట్లో బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. ఈ కేసులో ఇప్పటికే 16 మందిపై కేసులు నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో క్యాండిల్ ర్యాలీ చేయనున్నారు. దీనికి బీజేపీ నేత జేపీ నడ్డా కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version