ఆనంద‌య్య మందును అంద‌రికీ పంచాలి.. జ‌గ‌ప‌తి బాబు ఆస‌క్తిక‌ర కామెంట్లు

-

క‌రోనాకు ఎన్ని మందులు వ‌చ్చినా వాట‌న్నింటి కంటే ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని ఎక్కువ‌గా పొందింది మాత్రం నెల్లూరు జిల్లాలోని కృష్ణ‌ప‌ట్నం ఆనంద‌య్య త‌యారు చేసిన నాటుమందు మాత్ర‌మే. ఈ మందుకు ఉన్న డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చ‌ప్ప‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికే ఆస్ప‌త్రులు మొత్తం ఖాళీ అవుతున్నాయి. ఈ మందుపై ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో విప‌రీతంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇప్ప‌టికే దాదాపు 80వేల మంది ఈ మందు తీసుకుని క‌రోనాను జ‌యించారు. అయితే ఈ మందుపై జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. కొంద‌రు ప‌నిచేస్తుంద‌ని, కొంద‌రు ప్ర‌మాద‌మ‌ని వాదిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ముక్కుసూటిగా మాట్లాడే న‌టుడు జ‌గ‌ప‌తి బాబు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.

ఆనంద‌య్య రూపంలో మాన‌వ‌జాతిని కాపాడాటానికి నేచ‌ర్ ముందుకు వ‌చ్చింద‌ని జ‌గ‌ప‌తి బాబు అన్నారు. ఆ మందు శాస్త్రీయంగా అనుమ‌తి పొంది అంద‌రికీ పంపిణీ చేయాల‌ని జ‌గ్గూభాయ్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఆనంద‌య్య‌కు దేవుడి ఆశీస్సులు ఉండాల‌ని ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశాడు. ఆ క‌రోనా మందుపై వ‌స్తున్న ఎలాంటి చెడు వార్త‌ల‌ను న‌మ్మొద్ద‌ని, దేవుడు మంచి చేస్తాడ‌ని జ‌గ‌పతి స్ప‌ష్టం చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version