కరోనా వైరస్ నివారణకు నెల్లురు జిల్లా కు చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తను పంపిణీ చేసే ఔషధ పంపిణీ ని పోలీసులు అడ్డుకుంటున్నారని.. మందు పంపిణీలో పోలీసుల జోక్యం లేకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆనందయ్య హై కోర్టు ను ఆశ్రయించాడు. నెల్లూర్ జిల్లా ఎస్పీ, డీఎస్పీ తో పాటు కృష్ణ పట్నం పోలీసులను ప్రతి వాదులుగా పేర్కొంటు హై కోర్టు పిటిషన్ ఇచ్చాడు. అంతే కాకుండా ఆనందయ్య పిటిషన్ ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన తరపు న్యాయవాది హై కోర్టు ను కోరాడు.
ఆ పిటిషన్ నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు లో విచారణ జరగనుంది. ఇదీల ఉండగా.. గత కొద్ది రోజుల నుంచి ఆనందయ్య మందు పంపిణీ పై కాంట్రవర్సీ నడుస్తుంది. ఆనందయ్య ఓమిక్రాన్ వేరియంట్ కు కూడా ఔషదం పంపిణీ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఓమిక్రాన్ వేరియంట్ కు మందు పంపిణీ చేయడానికి ఎలాంటి అనుమతులు లూవని పోలీసులు అడ్డుకుంటున్నారు. అంతే కాకుండా కృష్ణ పట్నం ప్రజలు కూడా ఓమిక్రాన్ మందు పంపిణీని వ్యతిరేకిస్తున్నారు.