టెలివిజన్ స్టార్ యాంకర్ అనసూయ ప్రజెంట్..టాలీవుడ్ లోనే బిజీ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ఇటీవల మాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చిన రంగమ్మత్త..తెలుగు సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. మరో వైపున ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది. ‘పేపర్ బాయ్’ ఫేమ్ డైరెక్టర్ తో ఓ పిక్చర్ కంప్లీట్ చేసిన అనసూయ..‘దర్జా’లో లేడీ డాన్ రోల్ ప్లే చేసింది.
అనసూయ భరద్వాజ్..వెండితెరపైన కనబడితే చాలు అది కీలకమైన పాత్ర అయి ఉండి ఉంటుందనే అభిప్రాయం తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఏర్పడేలా చేసింది. ఇక ఈమె తెలుగు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ బుల్లితెరపైన సందడి చేస్తూనే ఉంది. తాజాగా ‘జబర్దస్త్’ కామెడీ షోలో ఎంట్రీ సందర్భంగా అనసూయ డ్యాన్స్ చేసింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘ఖుషీ’లోని ‘చెలియ..చెలియా’ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేశారు. అది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.
అనసూయ తన మూమెంట్స్ తో పిచ్చెక్కిస్తోందని వీడియో చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అనసూయ కీలక పాత్ర పోషించిన మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ పిక్చర్ ఈ నెల 29న విడుదల కానుంది. ప్రస్తుతం అనసూయ ‘రంగమార్తాండ, పక్కా కమర్షియల్, పుష్ప 2’ సినిమాల్లో నటిస్తోంది.