ప్రత్యేకంగా హోమం జరిపిస్తున్న అనసూయ.. వీడియో వైరల్..!

-

బుల్లితెర మహారాణిగా గుర్తింపు తెచ్చుకున్న గ్లామర్ బ్యూటీ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. తన గ్లామర్ ఫోటో షూట్ లతో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటూ బిహేవ్ చేస్తోంది. అంతేకాదు జబర్దస్త్ యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత వెండితెర పై ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఈమె చేతినిండా కొన్ని చిత్రాలు ఉన్నట్లు సమాచారం. అంతే కాదు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇటీవల తను ఫారిన్ ట్రిప్ వెళ్లిన క్రేజీ ఫోటోషూట్స్ తో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది.

ఎప్పుడు గ్లామర్ ఫోటోషూట్లతో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా యజ్ఞ హోమాలు చేస్తూ ఉన్న ఒక వీడియోను షేర్ చేయడంతో పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అనసూయ ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన ఈ వీడియోలో తన భర్త భరద్వాజతో కలిసి ప్రత్యేక పూజలు చేస్తోంది. అంతేకాదు అనసూయ కుటుంబ సభ్యులు కూడా సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. కొంతమంది వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య భక్తి పారవశ్యంలో మునిగిపోయారు అనసూయ దంపతులు. అంతేకాదు హరినామాలు కూడా పెట్టుకున్నారు.

అక్కడి వాతావరణం గమనించినట్లయితే సొంత ఊరిలో కులదైవానికి ప్రత్యేక పూజలు జరుపుకుంటున్నారేమో అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికైతే ఎప్పుడు గ్లామర్ లుక్ లో కనిపించే అనసూయ ఇలా ట్రెడిషనల్ లుక్ లో భక్తి పారవశ్యంలో మునిగిపోయి కనిపించడంతో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఏది ఏమైనా ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version