శ్రీతేజ్ కోసం విరాళాల సేకరణకు ముందుకు వచ్చిన ఫిల్మ్ ఛాంబర్..!

-

గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంధ్య థియేటర్ ఘటన పెద్ద ఎత్తున చర్చలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన ఘటన పై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం.. ఆ వెంటనే హీరో అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కామెంట్స్ చేయడంతో ఈ విషయం పెద్ద చర్చకు కారణమైంది. ఈ క్రమంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓ లెటర్ ను విడుదల చేసింది. ఈ ఘటనలో ఆసుపత్రి పాలైన బాలుడు శ్రీతేజ్ ను ఆదుకునేందుకు సభ్యులు ముందుకు రావాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపునిచ్చింది. అయితే ఇప్పటికే చనిపోయిన రేవతి కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం అని అల్లు అర్జున్ ప్రకటించారు. అలాగే శ్రీతేజ్ ఆసుపత్రి బిల్స్ అన్ని కూడా భరిస్తాం అని చెప్పిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version