రెండు ప్రత్యేక గీతాల్లో అనసూయ.. మనసు మార్చుకున్నట్టేనా..?

-

యాంకర్ అనసూయ ప్రత్యేక గీతాల్లో స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ప్రత్యేక గీతాల్ని ఐటెమ్ సాంగ్స్ అన్నందుకు ఒకానొక నెటిజన్ కి గట్టి క్లాస్ పీకింది. ఐతే అప్పట్నుండి అనసూయ, ప్రత్యేక గీతాల్లో నటించనని తేల్చింది. కానీ ప్రస్తుతం మళ్ళీ మనసు మార్చుకున్నట్టుంది. తాజా సమాచారం ప్రకారం అనసూయ రెండు ప్రత్యేక గీతాల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో రూపొందుతున్న సినిమాలో ఒక పాత్రలో నటించడంతో పాటు ప్రత్యేక గీతంలో పవన్ కళ్యాణ్ తో స్టెప్పులేయనుందట.

అలాగే కార్తికేయ హీరోగా వస్తున్న చావు కబురు చల్లగా సినిమాలోనూ అనసూయ కాలు కదుపుతుందట. దీనికోసం అనసూయ భారీ రెమ్యునరేషన్ దక్కించుకుందట. మొత్తానికి అసలు ప్రత్యేక గీతాల్లో కనిపించను అని చెప్పిన అనసూయ మరోమారు అందులో మెరిసి, అభిమానులని ఉర్రూతలూగించనుంది. అదలా ఉంటే అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్యాంక్యూ బ్రదర్ విడుదలకి సిద్ధం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version