సీమంతం ఫోటోలు షేర్‌ చేసిన లాస్య !

-

బుల్లి తెరపై యాంకర్ లాస్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.. అలాగే ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ 4 తో మరింత పాపులర్ అయింది అయితే తాజాగా ఈ భామ మరోసారి తల్లి కాబోతుంది.. ప్రస్తుతం బేబీ బంప్ తో ఉన్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది లాస్య..

యాంకర్ లాస్య తన చలాకీతనంతో, మాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది .. ఇప్పటికే పలు కామెడీ షోలతో అలరించిన ఈమె బిగ్బాస్ సీజన్ ఫోర్ లో కూడా కనిపించింది.. అలాగే ఎప్పుడూ తన కెరీర్ కు సంబంధించిన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది.. ఇప్పటికీ తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యల కోసం ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాను అంటూ చెప్పుకొస్తుంది.

ఈమె కొన్నాళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరిది ప్రేమ వివాహం జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సమయంలో తనకు మంజునాథ ఎంతో అండగా ఉన్నాడని పలుమార్లు ఇప్పటికే చెప్పుకొచ్చింది లాస్య. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు అయితే ఇప్పుడు లాస్య మరొకసారి తల్లి కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె సీమంతం కూడా అయింది. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version