సుమ ఉంటే ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని ఇండస్ట్రీ అంతా నమ్ముతుంటుంది. అందుకే సుమ డేట్స్ కోసం ఆడియో ఫంక్షన్లు, ఈవెంట్లు అన్నీ వెయిట్ చేస్తుంటాయి. ఇలాంటి సుమకి 2020భారీ నష్టాన్ని మిగిల్చింది. కరోనా ఎఫెక్ట్‌తో ఈ తొమ్మిదినెలల గ్యాప్‌లో కోటీ రూపాయలు పైగానే నష్టపోయింది సుమ.
టాలీవుడ్‌లో స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే చాలు, సుమకి పండగకొస్తుంది. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లతో లక్షల రెమ్యూనరేషన్ అందుకుంటుంది. రెండు నుంచి మూడు గంటలపాటు సాగే ఈవెంట్స్‌కి రెండు నుంచి 3 లక్షల వరకు చార్జ్ చేస్తుంది సుమ. ఇక హైదరాబాద్ కాకుండా మరోచోట ఆడియో ఫంక్షన్స్ నిర్వహిస్తే దానికి సెపరేట్‌గా చార్జ్ చేస్తుంది. ఇలా మూడు ఈవెంట్లు, ఆరు రెమ్యూనరేషన్లతో బిజీగా ఉండే సుమ ఇన్‌కమ్ సోర్స్‌ని గట్టిగా దెబ్బకొట్టింది కరోనా.
కరోనా లాక్‌డౌన్‌తో మార్చి థర్డ్ వీక్ నుంచి థియేటర్లు మూతబడ్డాయి. షూటింగులు ఆగిపోయాయి. ఈ మధ్యనే థియేటర్లు రీఓపెన్ అయినా, స్టార్ హీరోలు రిలీజ్ గురించి ఆలోచించట్లేదు. ఇక చిన్న సినిమాలు వస్తున్నా, భారీ ఫంక్షన్లు చెయ్యట్లేదు. కోవిడ్ స్ట్రెయిన్‌తో మరికొన్నాళ్లపాటు ఈవెంట్లు, ఫంక్షన్లు జరగకపోవచ్చు అంటున్నారు సినీజనాలు. అంటే సుమ మరికొన్నాళ్లపాటు ఈవెంట్ల గురించి మర్చిపోవాల్సి ఉంటుంది.
మార్చి నుంచి లెక్కేస్తే ఈ తొమ్మిదినెలల్లో సుమ దాదాపుగా కోటిరూపాయలకు పైగా సుమ నష్టపోయిందని చెప్పొచ్చు. లాక్‌డౌన్‌తో కొన్నాళ్లపాటు టీవీషోస్‌కి దూరమైన సుమ, ఈ మధ్యనే మళ్లీ బుల్లితెరపై మెరుస్తోంది. అయితే ఈవెంట్లతో వచ్చే మనీ మాత్రం మిస్ అవుతోంది. అయితే కరోనా ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించట్లేదని శాస్త్రవేత్తలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే ట్వంటీ ట్వంటీవన్‌లో కూడా సుమ నష్టాలు కొనసాగే అవకాశముందని చెప్పొచ్చు.