సన్న వడ్లకు 939 కోట్ల బోనస్.. 3.36 లక్షల రైతులకు లబ్ధి..!

-

సన్న రకాల వరి సాగు రైతుల పంట పండించింది. ఖరీప్ సీజన్ కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.10,149 కోట్ల ధాన్యం కొనుగోళ్లు చేసింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం ఈసారి సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లించింది. సన్న రకాల వరి సాగును ప్రోత్సహించటంతో పాటు బోనస్ చెల్లింపు రైతులకు అదనంగా లబ్ధి చేకూర్చింది. రాష్ట్రంలో దాదాపు 3.36 లక్షల మంది రైతులు ఈ సారి సన్న వడ్ల బోనస్ అందుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు 18.78 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటికి అదనంగా ఇచ్చే బోనస్ ప్రకారం రూ.939 కోట్ల బోనస్ చెల్లించాల్సి ఉండగా.. ఇప్పటికే రూ.591 కోట్లు చెలింపులు చేసింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 47.01 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 28.23 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 18.78 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం. గత ఏడాది 2023 ఖరీఫ్ సీజన్లో 41.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా.. ఈ ఏడాది అంతకంటే 6 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసింది. మొత్తం ఇప్పటివరకు రూ.10903 కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో రూ.10,149 కోట్ల చెల్లింపులు చేసింది. మొత్తం 8.84 లక్షల మంది రైతుల నుంచి ఈసారి ధాన్యం సేకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 8318 కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version