ఎప్పుడూ యాక్టివ్​గా ఉండే సుమ.. ఆ విషయంలో రోజూ బాధపడుతుందట!

-

బుల్లితెర వ్యాఖ్యాతగా లక్షల హృదయాల్ని గెలుచుకున్నారు సుమ. టెవిలిజన్‌ కార్యక్రమాలు, సినిమా వేడుకలు.. ఇలా వేదిక ఏదైనా తనదైన శైలిలో మాట్లాడి అలరిస్తుంటారు. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింపచేస్తూ ఆకట్టుకుంటారు. సుమ జన్మతః మలయాళీ అయినా తెలుగింటి కోడలై, మాటలతో మైమరపిస్తున్నారు. నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే జయమ్మ అనే చిత్రంతోనూ ప్రేక్షకులను అలరించారు.

అయితే సుమ అత్తగారు, మామగారు కన్నుమూసిన విషయం తెలిసిందే. సుమకి వాళ్ళ అత్తగారు అంటే చాలా ఇష్టమట. తన అమ్మ తర్వాత అమ్మలాగా భావించిన అమ్మగారు లేకపోవడంతో సుమ ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారట. తాను ఎన్ని ఫంక్షన్, ఎన్ని షోస్ చేసినా ఏ ఈవెంట్స్​కి వెళ్ళినా తన పిల్లల్ని దగ్గర ఉండి తనకన్నా బాగా చూసుకునేవారట. కానీ ప్రస్తుతం తన అత్త తమతో లేకపోవడం వల్ల.. ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే ఆమె ఫోటో చూసుకొని సు బాధపడుతూ ఉంటుందట. ఈ విషయాన్ని సుమ తన స్నేహితురాలికి చెప్పుకురావడం, ఇప్పుడా విషయం సోషల్​మీడియాలో రావడం జరిగిందని కథనాలు వస్తున్నాయి.

కాగా, ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ చిత్రంతో వెండితెరకి పరిచయమైన సుమ ‘పవిత్ర ప్రేమ’, ‘చాలా బాగుంది’, ‘వర్షం’, ‘ఢీ’, ‘బాద్‌షా’ తదితర చిత్రాల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version