BREAKING : షేక్ పేట్ ఎమ్మార్వోగా పని చేసిన సుజాత ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్ భూ వివాదంలో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఆర్ఐ నాగార్జున రెడ్డి, సుజాత ఎసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ కేసులో పోలీసు అధికారి రవీంద్రనాయక్ ను కూడా అరెస్టు చేశారు ఎసీబీ అధికారులు.
ఈ నేపథ్యమం లోనే.. గాంధీనగర్‌లో ఐదు అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు సుజాత భర్త. అధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు అప్పట్లో ఆరోపణలు చేశారు.
ఇక తాజాగా షేక్ పేట్ ఎమ్మార్వోగా పని చేసిన సుజాత ఆత్మహత్య చేసుకుంది. జూన్ 18న ఆత్మహత్య సుజాత భర్త అజయ్ చేసుకోగా.. ఇవాళ సుజాత ఆత్మహత్య చేసుకుంది. డెంగ్యూ తో పాటు హార్ట్ ఎటాక్ రావడంతో సుజాత చనిపోయిందంటున్న ఆమె బంధువులు చెబుతున్నారు. అయితే.. దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.