రూ.7,88,836 కోట్లు దాటిన ఆంధ్రా అప్పులు !

-

ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్‌ పై వైసీపీ రెబల్‌ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు కాగ్‌ కు ఫిర్యాదు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అప్పులు ప్రస్తుతానికి రూ.788836.58 కోట్లకు చేరాయని వెల్లడించారు. ఈ మేరకు విజయవాడలోని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కు ఎంపీ రఘురామ 12 పేజీల లేఖ రాశారు. దీని ప్రతిని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ గిరీష్‌ చంద్ర ముర్మూకూ పంపారు.

తాను పంపిన లెక్కలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రాష్ట్ర రుణ పరిమితి నిర్దారించేలా చూడాలని కోరారు ఎంపీ రఘురామ కృష్ణ రాజు. ఏపీ ప్రభుత్వం తన బడ్జెటేతర రుణాలను దాచిపెట్టి 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో రూ.70 వేల కోట్ల రుణ పరిమితి కోసం కేంద్ర ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతోందని ఎంపీ రఘురామ కృష్ణ రాజు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏపీ సర్కార్‌ తప్పుడు లెక్కలు చూపించి.. రుణాలు పొందుతుందని.. దీని వల్ల ఏపీ ప్రజలపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు రఘురామ.

Read more RELATED
Recommended to you

Exit mobile version