జనవరి 20వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో వికేంద్రీకరణ అంశం గురించి అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతి ప్రాంతంలో చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి చర్చలు జరుగుతుండగా మరోపక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో రీ ఎంట్రీ ఇచ్చి ఉదయం హైదరాబాద్ నగరంలో సినిమా షూటింగ్ లో పాల్గొని సాయంత్రం పూట మంగళగిరి నియోజకవర్గానికి చేరుకుని పార్టీ ఆఫీస్ వద్ద అమరావతి ప్రాంతంలో ధర్నాలు నిరసనలు చేస్తున్న ఆందోళనకారులతో కలసి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళదామని భావించిన పవన్ కళ్యాణ్ కి ఏపీ పోలీసులు ముప్పుతిప్పలు పెట్టారు.
ఇటీవల బిజెపి పార్టీ తో పొత్తులు పెట్టుకుని వైయస్ జగన్ను రాజకీయంగా ఇబ్బందులపాలు చేద్దామని వెనక మోడీ ఉన్నాడు కదా రెచ్చి పోదాం అని భావించిన పవన్ కళ్యాణ్ కి ఏపీ బీజేపీ నేతల నుండి కూడా సరైన సపోర్ట్ రాకపోవడంతో అసెంబ్లీని ముట్టడిస్తామని అమరావతి ఆందోళనకారులతో కలసి అసెంబ్లీ సమావేశాల వద్ద చేద్దామని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఏపీ పోలీసులు మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి బయట కూడా అడుగు పెట్టకుండా నిర్బంధించారు.
దీంతో పార్టీ ఆఫీస్ బయట కార్యకర్తలు మహిళలు ఉన్న సందర్భంలో పవన్ కళ్యాణ్ మీడియా వద్ద మాట్లాడుతూ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడానికి రాజధానిని విశాఖపట్టణం తరలించే కార్యక్రమం జగన్ చేస్తున్నాడని రాష్ట్రంలో ఉన్న మహిళలు యువత మాత్రమే దీన్ని అడ్డుకోవాలని రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ను అడ్డుకుంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరియు పోలీసుల మధ్య తీవ్ర తోపులాటలు జరిగాయి.