తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తాజాగా ఆయన పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఈ సందర్భంగా రాజీనామా లేఖ చంద్రబాబు నాయుడికి రాయటం జరిగింది. లేఖలో మూడు రాజధానుల నిర్ణయం వ్యతిరేకిస్తున్నానని అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చాలా అన్యాయంగా జరిగింది ప్రస్తుత పరిణామాలు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉందని మనసు కలిచివేస్తోంది అని టీడీపీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లేఖలో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ముందుగా వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ తో అత్యవసరంగా భేటీ అయిన తర్వాత ఒక్కసారిగా సడన్ గా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి చంద్రబాబుకి రాజీనామా లెటర్ పంపించినట్లు వార్తలు వినపడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం జరిగింది.
ఇక శాసనమండలిలో కూడా ఆమోదం పొందే తరుణంలో శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఎక్కువగా ఉండటంతో విపక్ష పార్టీ సభ్యుల బలం తగ్గించేందుకు…వైయస్ జగన్ ఈ విధంగా వ్యక్తిగత వేసినట్లు…శాసన మండలి లో ఉన్న టిడిపి ఎమ్మెల్సీలను ఒక్కొక్క లను తన వైపు లాక్కోవడానికి వ్యూహాలు వేస్తున్నట్లు వికేంద్రీకరణ బిల్లు శాసనమండలిలో ఆమోదం పొందే విధంగా జగన్ రాజకీయం చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీలో మరియు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి.