Andhra Pradesh :ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు విడుదల

-

గ్రూప్-2 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్సు అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో పెట్టింది. 1:100 నిష్పత్తిలో గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

గత ఏడాది డిసెంబర్ 7న గ్రూప్ -2 నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ జారీ చేసింది. ఫిబ్రవరి 25న గ్రూప్‌ 2 ప్రిలిమ్స్‌ పరీక్ష జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్ధాయిలో 7 వారాల్లో గ్రూప్‌-2 ప్రిలిమ్స్ ఫలితాలీను ఏపీపీఎస్సీ ప్రకటించింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్డ్ర వ్యాప్తంగా 899 పోస్టులకి గ్రూప్-2 పరీక్షలను నిర్వహిస్తున్నారు. మొత్తం 4,04,037 మంది అభ్యర్ధులు గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షలు అందులో 92 వేల మంది క్వాలిఫై అయ్యారు. త్వరలోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ ను ఏపీపీఎస్సీ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version