AP BUDGET : వ్యవసాయం రంగంలో దేనిదేనికి ఎంత ఖర్చు చేశారంటే..?

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రధానంగా వ్యవసాయ రంగం గురించి చూసినట్టయితే.. జగనన్న పాలవెల్లువ కింద రూ.2697 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. 29 దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ కింద ర53.53లక్షల రైతులకు సాయం చేశారు. వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ రూ.33,300 కోట్లు కేటాయించినట్టుతెలిపారు.

కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులకు రూ.13,500 సాయం. వైఎస్సార్ చేయూత కింద రూ.14,129 కోట్లు. ఉచిత పంటల బీమా కింద రూ.3411 కోట్లు. సున్నా వడ్డీ పంట రుణాల కింద 1835 కోట్లు.. రైతులకే నేరుగా సేవలందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు.. వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతర విద్యుత్ ఉంటుంది. వ్యవసాయ రంగం విద్యుత్ కోసం రూ.37374 కోట్ల సబ్సీడీ. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు. ఇన్ పుట్ సబ్సీడీ కింద రూ.1277 కోట్లు అందించా. వైఎస్సార్ వ్యవసాయ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉద్యానవన రంగంలో వివిధ పథకాల ద్వారా రూ.4363 కోట్లు అందించాం. 2356 మంది ఉద్యానవన సహాయకులు నియామకం అయ్యారు. 10,216 వ్యవసాయ గోదాముల నిర్మాణాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version