ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 9 మంది ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. శ్రీకాకుళం-పెడద పరమేశ్వరరావు, అమలాపురం (SC)- జంగా గౌతమ్, మచిలీపట్నం-గొల్లు కృష్ణ,విజయనగరం-బొబ్బిలి శ్రీను, విజయవాడ-వల్లూరు భార్గవ్, నంద్యాల-జేఎల్ నరసింహ యాదవ్, అనంతపురం-వజ్జల మల్లికార్జున, ఒంగోల్-ఈదా సుధాకర్ రెడ్డి,హిందూపురం-సమద్ షాహీన్ల పేర్లతో జాబితా విడుదల చేసింది.

అయితే కడప నుంచి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే .ఈ మేరకు ఆమె ఇప్పటికే నామినేషన్ కూడా దాఖలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల దూసుకుపోతున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష పార్టీలపై ఆమె విమర్శలు కురిపిస్తున్నారు. రాష్ట్ర విభజనతో బలహీనమైన కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల రాకతో కాంగ్రెస్ సభలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. వచ్చే ఎన్నికల్లో సార్వత్రిక స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు వైఎస్ షర్మిల తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version