జగన్ ఓ బచ్చా అని చంద్రబాబు పేర్కొంటున్నాడని.. ఇలాంటి మాటలు విన్నప్పుడు కొన్ని కథలు గుర్తుకొస్తాయని సీఎం జగన్ తెలిపారు. తాజాగా చింతపాలెం లో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకు కూటమికి అధికారం కావాలట. కృష్ణుడిని చూసి కూడా కంశుడు బచ్చా అనుకున్నాడు. రాముడిని బచ్చా అనుకున్న మారీశడు.. రామోజీ రూపంలో, ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలా కనిపిస్తా ఉన్నారు.
చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటు వైపు హీరోలందరూ బచ్చాల మాదిరిగా కనిపిస్తారు. అయ్యా, చంద్రబాబు నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఒంటరిగా ధైర్యంగా ముందుకు వస్తున్నాను. 14 ఏళ్లు సీఎంగా ఉన్నావ్ కదా.. మూడు సార్లు సీఎం చేసిన చంద్రబాబు ఈ బచ్చాను చూసి ఎందుకు భయపడుతున్నాడని ప్రశ్నిస్తున్నారు. పొత్తుల కోసం ఎందుకు ఇప్పుడు ఎగబడుతున్నావు చంద్రబాబు. 75 ఏళ్ల వయస్సు లో ఎందుకు 10 మందిని పోగేసుకోవాల్సి వస్తుందని అడిగారు.