పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 56,421 ఓట్లతో ఆయన సూపర్ విక్టరీ సాధించారు. తొలుత నరసాపురం ఎంపీగా పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఉంచి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎలాగైనా సరే రఘురామకృష్ణంరాజును ఓడించాలని వైసీపీ వేసిన ఎత్తులను రఘురామకృష్ణంరాజు చాకచక్యంగా తిప్పికొట్టారు. ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఉండి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో పర్యటించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
దీంతో రఘురామకృష్ణంరాజు బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. రాజధాని అమరావతి విషయంలో తొలి నుంచి ఆయన పోరాటం చేశారు. ఆయనపై దాడి జరిగినా వెనక్కి తగ్గలేదు. ఏపీకి అమరావతినే రాజధానిగా ఉండాలని పోరాటం చేశారు. ఓ రకంగా వైసీపీకి దూరంగా ఉండానికి కూడా రాజధాని అంశమే ప్రధానం కారణం. అమరావతి రాజధాని కోసం పోరాటం చేసిన రైతులు, ఆ ప్రాంత వాసులకు సైతం అండగా నిలిచారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని అంటూ హామీ ఇచ్చి మరీ ఎన్నికల్లో పోటీ చేశారు. రఘురామకృష్ణంరాజు హామీలను నమ్మిన ఉండి ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టారు.