విచారణలో ఆ విషయాలు ఒప్పుకున్న డైరెక్టర్ ఆర్జీవి..!

-

ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో డైరెక్టర్ ఆర్జీవి విచారణ ఐదు గంటలుగా సాగుతుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఎక్స్ లో పోస్ట్ చేసారు ఆర్జీవి. తన ఎక్స్ లో నుండే పోస్టింగ్స్ చేసినట్టు ఒప్పుకున్న ఆర్జీవి.. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా పోస్టింగ్స్ చేసినట్టు చెప్పారు. ఆ పోస్టింగ్స్ తో వైసీపీ నేతలకు సంబంధం లేదని ఆర్జీవి చెప్పినట్లు తెలుస్తుంది. ఫైబర్ నెట్ నుండి రెండు కోట్లు ఆర్జీవికి కేటాయించడంపై ప్రశ్నలు సంధిస్తున్నారు పోలీసులు.

కానీ రెండు కోట్ల కేటాయింపు పై ఆర్జీవి ఏ సమాధానాలు చెప్పలేదు. ఇక వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలపై ఆరా తీసిన పోలీసులకు వైసీపీ నాయకులతో వ్యక్తి గత పరిచయాలు మాత్రమే ఉన్నాయని ఆర్జీవి సమాధానాలు ఇచ్చాడు. మరో నాలుగైదు గంటల పాటు ఈ విచారణ జరగనున్నట్లు తెలుస్తుంది. అయితే విచారణ కి వచ్చే ముందుగా వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కలవడంపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version