ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. విశ్వసనీయత ఒకవైపు, మోసాలు మరోవైపు.. ఇంటింటి అభివృద్ధి ఓవైపు.. అసూయ మరోవైపు.. ధర్మం ఓ వైపు.. అధర్మం మరోవైపు ఉంది. గతంలో మూడు సార్లు అధికారంలో ఉండి.. అబద్దం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి వీటిని ప్రజలకు రిటర్న్ గిప్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం కనిపిస్తోంది.
ఈ ఎన్నికలు చంద్రబాబు, జగన్ కి కాదు.. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య ఈ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ ప్రజల పక్షం అని గర్వపడుతున్నాను. ఈ యుద్ధంలో దత్తపుత్రుడు, ఎల్లోమీడియా కాకుండా.. ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ.. ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నయం ఇవ్వకుండా మరో పార్టీ.. వీరందరూ యుద్ధం చేస్తున్నారు. కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి. మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు, పిల్లలు అక్కాచెల్లెమ్మలు, అవ్వతాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలు వీరందరినీ రక్షించేందుకు మీరంతా సిద్ధమేనా..? అని అడిగారు సీఎం జగన్.