ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గుర్తింపు పొందిన జువాన్ విసెంటె పెరెజ్ మోరా ఇటీవలే మరణించాడు. జువాన్ 114 సంవత్సరాల వయసులో ప్రాణాలు కోల్పోయారు. 2022లో ఈ భూమ్మీద ప్రపంచంలోనే అత్యంత ఎక్కువకాలం జీవించిన వ్యక్తిగా జువాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు ఎక్కారు.
ఈ మేరకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. జువాన్ వయస్సు ఫిబ్రవరి 4, 2022 నాటికి 112 సంవత్సరాల 253 రోజులు. జువాన్ వెనిజులా కు చెందినవాడు.జువాన్ తల్లిదండ్రులకు మొత్తం పదిమంది సంతానం కాగా అందులో ఈయన తొమ్మిదో వా సంతానం. మంగళవారం రోజున జువాన్ 112 ఏళ్ల వయసులో మృతి చెందాడు. ఆయన మే 27, 1909లో ఆండియన్ రాష్ట్రంలోని టాచిరాలో గల ఎల్కోబ్రే పట్టణంలో జన్మించాడు. ఆయనకు 11 మంది పిల్లలు ఉన్నారు.2022 సంవత్సరం నాటికి అతడికి 41 మంది మనుమలు ఉండగా, 30 మంది మునిమనవళ్లు ఉన్నారు.