ఖబడ్దార్.. మీ ఆటలు ఇక సాగవు.. వైసీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్..!

-

అధికార వైసీపీ నేతలకు టీడీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం కుప్పంలో పర్యటించిన బాబు.. ఈ సందర్భంగా టీడీపీ అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఐదేళ్లు అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని రౌడీయిజంతో రాజకీయం చేశారు.. ఇక నుండి పోలీసులు మీరు చెప్పినట్లు వినరు.. ఎన్నికల అధికారులు చెప్పినట్లే చేస్తారు.. ఇకపై మీ ఆటలు సాగవని హెచ్చరించారు. ఖబడ్డార్.. ఇకపై జాగ్రత్తగా ఉండండి.. ఎన్నికలను సజావుగా జరిగనివ్వండని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. వైసీసీ నేతలు నోరు విప్పితే అబద్దాలు.. అన్ని ఫేక్ వార్తలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా జీవితంలో ఇలాంటి రాజకీయాన్ని ఏనాడు చూడలేదని బాధపడ్డారు.

కొందరు కులాలు, మతాలు చూసి ఎన్నికల్లో పోటీ చేస్తారు.. కానీ పేదలు, మంచివాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ నేను పోటీ చేస్తానని అన్నారు. పేదలే నా మతం, నా కులమని బాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు. వైసీపీ నేతలు ఐదేళ్లలో ఎన్నో హింసా రాజకీయాలు చేశారు.. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను రద్దు చేశారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పాలనను అంతమొందించి.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని బాబు ధీమా వ్యక్తం చేశారు. లక్ష ఓట్ల మెజార్టీతో కుప్పంలో తనను గెలిపించాలని ఈ సందర్భంగా బాబు విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version