మరో వెయ్యి కోట్లు అప్పు తీసుకున్న ఏపీ సర్కార్

-

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పుల చిట్టా రోజురోజుకు గుట్టలా పెరిగిపోతోంది. ఇప్పటికే వేల కోట్ల అప్పులు చేసిందని.. తలకు మించిన భారంగా అప్పులు చేశారని కేంద్రం చెప్పింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ద్వారా మరో వెయ్యి కోట్ల రుణం తీసుకుంది ఏపీ సర్కార్. సెక్యూరిటీ వేలం ద్వారా రూ.500 కోట్ల చొప్పున రెండు లాట్ల సెక్యూరిటీలను వేలం వేశారు.

13 ఏళ్ల కాలపరిమితితో 7.72శాతం వడ్డీకి ఈ సెక్యూరిటీల వేలం నిర్వహించారు. దీని ద్వారా ఏపీ ప్రభుత్వం రూ.1000కోట్లు రుణం పొందినట్టు  ఆర్‌బీఐ వెల్లడించింది. సెక్యూరిటీల వేలం ద్వారా జులై 21వరకు రూ.21,500 కోట్ల రుణాన్ని ఏపీ ప్రభుత్వం పొందింది. ఇప్పటికే ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కొద్దిపాటి వెసులుబాటు మాత్రమే మిగిలి ఉంది. ఆరు నెలలు గడవక ముందే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ద్వారా కేంద్రం అనుమతించిన మొత్తంలో భారీగా రుణం తీసుకుంది. రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవారం నిర్వహించే సెక్యూరిటీల వేలంలో పాల్గొని ఈ మొత్తం రుణం తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version