ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ.ఇప్పుడు యావత్ డ్రగ్స్ సప్లై చేసే డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని షర్మిల విమర్శించారు.గంజా, హెరాయిన్,కొకైన్ ఏది కావాలంటే అది దొరికే “ఉడ్తా ఆంధ్రప్రదేశ్” అని ఆరోపించారు.ఇండియాలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఏపి వైపే.మొదటి 5 ఏళ్లు టీడీపీ ,తర్వాత 5 ఏళ్లు వైసీపీ..10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారు అని మండిపడ్డారు.
డ్రగ్స్ రవాణా,వాడకంలో నెంబర్ 1 ముద్ర వేశారు అని ధ్వజమెత్తారు.25 వేల కేజీల భారీ మాదక ద్రవ్యాలు బ్రెజిల్ నుంచి విశాఖ తీరం చేరితే…తమ తప్పు ఏమీ లేదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్న టీడీపి ,వైసీపీ,బీజేపీ పార్టీలకు సిగ్గుండాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర రాష్ట్రాల నిఘా వ్యవస్థ సపోర్ట్ లేకుండా…వేల కోట్ల డ్రగ్స్ తీరానికి ఎలా చేరుతాయి ? డ్రగ్స్ మాఫియాతో మీకు లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా ? మీ అండదండలతోనే కదా డ్రగ్స్ రవాణాలో ఏపి “సేఫ్ హెవెన్” గా మార్చింది ?. తెర వెనుక ఎంతటి వాళ్లున్నా నిజాలు నిగ్గు తేల్చాలని CBI నీ కోరుతున్నాం అని అన్నారు. ఆసియాలోనే అతి పెద్ద డ్రగ్ డీల్ గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు,పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.