ఏపీలో విగ్రహాల ధ్వంసంపై రాజకీయ దుమారం రేగింది. విగ్రహాల ధ్వంసం వెనుక కుట్ర ఉందని, ఈ విగ్రహాల ద్వంసం వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నిన్న ఒక ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యల మీద టీడీపీ నేత నారా లోకేష్ అలాగే నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. విగ్రహాలను ధ్వంసం చేసింది దొంగలు, పిచ్చోళ్ళని ముందు పేర్కొన్న పోలీసులు ఇప్పుడు దానిని టిడిపి బిజెపి నేతలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
అలాగే బిజెపి నేతలు కూడా ఈ కుట్రలో భాగం అయ్యారని ఆయన చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఖండించారు. విగ్రహాలు ధ్వంసం కేసులో బీజేపీ ఏమాత్రం సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇంతమందిని అరెస్ట్ చేశామని చెబుతున్న పోలీసులు వారిని మీడియా ముందు ప్రవేశ పెట్టకపోవడం కాస్త చర్చనీయాంశంగా మారింది. చూడాలి ఈ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో ?