ఆంధ్రాలో ప‌ర్యాట‌కం ప‌డ‌కేసింది…

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వం ప‌ర్యాట‌క రంగాన్ని పూర్తిగా ప‌క్క‌న ప‌డేసింది. దీంతో ఈ రంగం నుంచి ఉపాధి, ఉద్యోగావ‌కాశాలు స‌న్న‌గిల్లడ‌మే కాకుండా వ్యాపారాలు దెబ్బ‌తింటున్నాయ‌ని ఈ రంగంతో అనుబంధం ఉన్న రంగాల వారు గ‌గ్గోలు పెడుతున్నార‌ట‌. వాస్త‌వానికి ఏ ప్ర‌భుత్వానికైనా చాలా త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ ఆదాయాన్ని స‌మ‌కూర్చే మార్గ‌మేదైనా  ఉందా అంటే అది  ప‌ర్యాట‌క‌రంగ‌మేన‌ని చెప్పుకోవాలి. ఈ రంగం మీద పెట్టుబ‌డి పెట్ట‌డం ప‌ర్యాట‌కుల సంఖ్య పెరిగి ఆర్టీసీ, ఆటో వాలా ద‌గ్గ‌ర నుంచి హోట‌ళ్లు, షాపింగ్, ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు టికెట్ల రూపంలో పెద్ద మొత్తంలోనే ఆదాయం స‌మ‌కూరుతుంది.

దుర‌దృష్ట‌వ‌శాత్తు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం మాత్రం ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డంపై ఆరంగంపై ఆధార‌ప‌డిన వ్యాపారులు మండిప‌డుతున్నారు. ఇక గ‌త ప్ర‌భుత్వం తీవ్ర ఒత్తిడిలో ఉన్నా హైద‌రాబాద్‌కు ధీటుగా అమ‌రావ‌తిని, దాని చుట్టూ ప‌క్క‌ల ప్రాంతాల‌ను విశాఖ‌, విజ‌య‌వాడ‌, గుంటూరు, రాయ‌ల‌సీమ జిల్లాల్లోని ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు పెద్ద ఎత్తున నిధుల‌ను ఖ‌ర్చు చేసింది. దానికి అనుగుణంగానే ప‌ర్యాట‌కుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.

ఎప్పుడూ హోట‌ళ్లు ప‌ర్యాట‌లతో సంద‌డిగా నిండుగా క‌నిపించేవి. అప్పుడు 90 నుంచి 95శాతం వ‌ర‌కు హోట‌ళ్ల‌లో ఎప్పుడూ రూంలు బుక్ అయి ఉంటే ప్ర‌స్తుతం మాత్రం అందుకు విరుద్ధంగా 40శాతం మించి రూంలు నిండ‌టంలేద‌ని హోట‌ల్ బిజినెస్ సుదీర్ఘ‌కాలంగా కొన‌సాగుతున్న వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. దీనితో ఈ వ్యాపారం నుంచి తప్పుకునే ఆలోచనలోనే చాలా మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది.  ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే హోటల్స్ ని అద్దెకు ఇచ్చేస్తున్నారట.

కీలక ప్రాంతాల్లో కూడా పర్యాటక శాఖ వెల‌వెల‌బోతోంద‌ని స్వ‌యంగా ప్ర‌భుత్వ అధికారులే లెక్క‌లు వినిపిస్తుండ‌టం దేనికి సంకేత‌మ‌ని విప‌క్షాలు ప్ర‌భుత్వ తీరును ఎండ‌గ‌డుతున్నాయి.  వాస్త‌వానికి రాజధాని ప్రాంతంలో పనులు ఎక్కువగా ఉండటంతో చాలా మంది చూడటానికి వచ్చే వారు… దీనితో గుంటూరు కృష్ణా జిల్లాల్లో హోటల్స్ కి మంచి గిరాకి ఉండేది. ఇప్పుడు విదేశీయులు కూడా అక్క‌డ‌కి రావ‌డం రావడం లేదని వ్యాపారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version