ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై మరో సంచలన పోస్ట్ పెట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పోస్ట్ పెట్టడం జరిగింది. చంద్రబాబు రైతుల ఉసురు పోసుకోవద్దు అంటూ… రైతు పథకాలను గుర్తు చేశారు జగన్.
రైతుల పంటల బీమా ప్రీమియం భారమా ? అంటూ పోస్ట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. తమ హయాంలో రైతుల పైన పైసా భారం లేకుండా పంటల బీమా విజయవంతంగా అమలు చేశామని గుర్తు చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి.
కానీ… చంద్రబాబు ప్రభుత్వంలో డబ్బులు వసూలు చేస్తున్నారని నిప్పులు జరిగారు. తమ ప్రభుత్వంలో… ఐదు సంవత్సరాల పాటు మూడు వేల కోట్లకు పైగా ప్రీమియం.. మొత్తాన్ని బీమా కంపెనీలకు చెల్లించామని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. గతంలో బీమా చేయించుకున్న వారు సైతం పరిహారం కోసం అధికారులు…. భీమా కంపెనీల చుట్టూ… చెప్పులు అరిగేలా తిరిగేవారు అన్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి..