ఏపీ టెట్, టీఆర్టీ పరీక్షల షెడ్యూల్ పై వీడిన సస్పెన్స్.. హైకోర్టు కీలక ఆదేశాలు

-

ఆంధ్రప్రదేశ్  టెట్, టీఆర్టీ పరీక్షలు ఒకేసారి ఉండటంతో నిరుద్యోగులు రెండింటినీ ఒకేసారి ఎలా రాయాలనే తర్జన భర్జన పడ్డారు. రెండు పరీక్షల మధ్య తగినంత సమయం లేకపోవడంతో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభత్వం విడుదల చేసిన షెడ్యూల్ను పూర్తిగా రద్దు చేసి మరో నూతన షెడ్యూల్ విడుదల చేసేలా చూడాలని కోరారు.

అయితే ఈ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోన్న టెట్, టీఆర్టీ పరీక్షల షెడ్యూల్ను మార్చాలని హైకోర్టు ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని సూచించింది. కాగా, ఏపీ టెట్ హాల్ టికెట్ల విడుదలకు పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 23 నుంచి హాల్ టికెట్లను అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version