ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో టాటా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని టాటా గ్రూప్, ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మధ్య జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక రంగాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా, మరో 20 హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. తాజ్, వివాంటా, గేట్వే, సెలెక్యూషన్స్, జింజర్ హోటళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రూ. 40 వేల కోట్ల పెట్టుబడితో టాటాపవర్ సోలార్, విండ్ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. విశాఖలో కొత్త ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖనగరంలో టీసీఎస్ ద్వారా 10వేల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ భేటీలో సీఎం చంద్రబాబు తో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు.