ఏపీలో దారుణం.. రెండేళ్ల బాలుడిని ఈడ్చుకెళ్లి చంపిన కుక్కలు

-

ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నారు. చిన్నారులపై దాడికి పాల్పడుతున్నాయి. చిన్నారులను కరిచి కరిచి చితమేస్తున్నాయి. ఇలాంటి ఘటన ఒకటి ఎన్టీఆర్ జిల్లాలో తాజాగా కలకలం రేపింది. పెనుగంచి ప్రోలు మోడల్ కాలనీలో ఇంటి వద్ద ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిని వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. దాదాపు 10 కుక్కలు బాలుడి పై దాడి చేసినట్టు పేరెంట్స్ తెలిపారు.  బాలుడిని పొలాల్లోకి ఈడ్చుకెళ్లి కరిచి చంపేశాయి. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

తమ బాలుడి మృతికి మున్సిపల్ సిబ్బందే కారణమని ఆరోపిస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణ విషయంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ బాలుడిని మున్సిపల్ సిబ్బందే పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version