Tirumala: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

-

Tirumala Srivari Sarvadarshan : తిరుమల భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం నిన్న ఒక్క రోజు 15 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 58, 236 మంది దర్శించుకున్నారు.

10 hours for Tirumala Srivari Sarvadarshan TTD

అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 25, 446 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4. 38 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు తిరుమలలో 4వ రోజు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ తెప్పల పై ఐదు ప్రదక్షణములుగా విహరించనున్నారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి. అటు ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేసింది టిటిడి.

Read more RELATED
Recommended to you

Exit mobile version