ఏపీకి కేంద్రం మరో శుభవార్త చెప్పింది. ఏకంగా ఏపీకి రూ. 10,461 కోట్లు విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. రెవెన్యూ లోటు నిధులు విడుదల చేసింది కేంద్రం. దీంతో రూ. 10,461 కోట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు చేరాయి. విభజన అంశాల్లో భాగంగా రెవెన్యూ లోటు నిధుల విడుదల చేయనున్నట్టు రెండు వారాల క్రితం ప్రకటించింది కేంద్రం. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికీ నోట్ పంపింది కేంద్ర ప్రభుత్వం.
పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘సురక్ష చక్ర’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఈనెల 15 నుంచి అమలు చేయనుంది. వాలంటీర్లు, గృహసారథులు నెలరోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలన చేయనున్నారు. పథకాలకు అర్హత ఉన్న వారిని గుర్తించి వారే దరఖాస్తులు చేసి, లబ్ధి చేకూరుస్తారు. తమకు అన్ని అందుతున్నాయని చెప్పిన వారిని ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతారు.